తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి గరిష్ఠంగా మూడు గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి కానుంది.
టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు, రూ. 300 ప్రత్యేక దర్శనం, నడకదారి భక్తుల దివ్యదర్శనాలకు రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న సోమవారం నాడు స్వామివారిని 60,154 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.67 కోట్ల ఆదాయం లభించింది.
మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్: మోహన్ బాబు