టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోమవారం సాయంత్రం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తానేమీ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీకి ఉన్న విభేదాలు, కాంగ్రెస్ తో కలవడం, సుమారు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లవ్వడం తదితర కారణాలతోనే టీడీపీ ఓడిపోయిందని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు.
తాను పార్టీని మారాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని సినీ నిర్మాత అంబికా కృష్ణ వెల్లడించారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెబుదామనే అనుకున్నానని, అయితే, ఆయన అందుబాటులో లేరని అన్నారు. అందుకే హీరో బాలకృష్ణకు విషయం చెప్పానని తెలిపారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబికా కృష్ణను ఆనాటి సీఎం చంద్రబాబు ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఏపీ ఎఫ్డీసీ పదవికి రాజీనామా చేశారు.
ఏపీ అసెంబ్లీలో కడప ఫ్యాక్షన్ ..అచ్చెన్నాయుడు ఫైర్