telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్లైమాక్స్ పూర్తి చేసుకొని పాటలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’…

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు యాక్షన్​ ఎపిసోడ్స్​తో బిజీగా గడిపిన​ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్.. ఇక పాటల మూడ్​లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చరణ్, ఆలియా భట్​లపై అద్భుతమైన రొమాంటిక్​ సాంగ్​ను ఈనెల 12 నుంచి తెరకెక్కించనున్నారట. హైదరాబాద్​లోని ఓ స్టూడియోలో ఇందుకోసం స్పెషల్ గా సెట్​ కూడా వేయించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్‌లు, టీజర్‌లు అన్నీ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Related posts