telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆదిపురుష్ : సీతగా అనుష్క శర్మ ?

Anushka

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొదట ఆ పాత్రలో కీర్తి సురేష్, కియారా అద్వాణీ, ఊర్వశి రౌటెలా.. పేర్లు విన్పించాయి. కానీ ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ తెరమీదకు వచ్చింది. అనుష్క శర్మ దాదాపు ఖరారైందని బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అనుష్కను ఇటీవల దర్శకుడు ఓం రౌత్ కలసి కథ, ఆమె పాత్ర గురించి వివరించి చెప్పాడని, ఆమె హ్యాపీగా ఒప్పుకుందని అంటున్నారు. అయితే, అనుష్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా? అనుష్కకు జనవరిలో డెలివరీ అవుతుంది. ఈ విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కూడా జనవరిలోనే మొదలవుతుంది. అందుకే ముందుగా ప్రభాస్, ఇతర తారాగణంపై సన్నివేశాల భాగాన్ని పూర్తి చేస్తారట. డెలివరీ అయిన రెండు నెలల తర్వాత తాను షూటింగుకి రెడీ అయిపోతానని అనుష్క చెప్పిందట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Related posts