telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్‌

పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రభాస్‌, పూజా హెగ్డే న‌టిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్. అత్యంత‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న సినిమా నుంచి రెండో సాంగ్.. హిందీ వెర్షన్​ రిలీజైంది. ‘ఆషికీ ఆగయి’ అంటూ సాగుతున్న లిరిక్స్​ దానికి తోడు విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

Radhe Shyam - Aashiqui Aa Gayi Song Teaser: 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్  సాంగ్ టీజర్ రిలీజ్ | Radhe Shyam Movie Team Released Aashiqui Aa Gayi Hindi  Version Song Teaser Today 29 11 2021

సాంగ్ స్టార్ట్‌లో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?’ అని పూజా, ప్రభాస్‌ను అంటే.. ‘అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్‌ బదులిస్తాడు. దీనికి ‘కానీ, నేను జూలియెట్‌. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్‌’ అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ‘కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్‌షిప్‌ కోరుకుంటున్నా’ అంటూ ప్రభాస్‌, పూజను కిస్‌ చేయడంతో పాట మొదలవుతుంది. 

Radhe Shyam song Aashiqui Aa Gayi Out: Prabhas, Pooja Hegde embark on a  journey of love in this sweet ballad | PINKVILLA

ప్రభాస్‌, పూజాల లుక్స్‌ అభిమానులకు ఆక‌ట్టుకుంటాయి. ఈ పాటను ఇటలీలోని కొన్ని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. 

Radhe Shyam Song | राधे श्याम का गाना आशिकी आ गई का टीज़र रिलीज, दोनों की

Related posts