telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్

Nani

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వి’ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. మరో మూడు చిత్రాలు చేతిలో ఉండగా.. తన తర్వాతి ప్రాజెక్టుపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నాని. ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్‌ వివేక్ ఆత్రేయతో.. నాని సినిమా చేయబోతున్నారట. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే కనుక ఈ ఏడాది చివరలో వీరి కాంబోలో ఓ సినిమా స్టార్ట్ అవ్వనుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతుందని సమాచారం. ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయతో నాని సినిమా చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా అన్ని సరిగ్గా ఉంటే ఈ ఏడాదే నాని నటించిన ‘వి’, ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు విడుదలయ్యేవి. కానీ కరోనాతో వచ్చిన విరామం అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది.

Related posts