telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పసివాడిని కాపాడిన పిల్లి… ఎలాగో మీరే చూడండి

Cat

ఓ పిల్లి పసివాడి ప్రాణాలను కాపాడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌ అవుతోంది. కొలంబియాలోని బొగొటాలో ఈ ఘటన జరిగింది. వీడియోను పరిశీలిస్తే.. శామ్యుల్ లియాన్ అనే ఏడాది వయసుండే బాబు లివింగ్ రూంలో ఆడుకుంటూ ఉన్నాడు. కొద్ది సేపటి తరువాత పాకుకుంటూ మెట్ల దగ్గరకు వెళ్లిపోయాడు. సోఫాలో కూర్చొని బాబును చూస్తున్న పిల్లి.. ఒక్కసారిగా దూకి బాబు దగ్గరకు వచ్చింది. సరిగ్గా పిల్లవాడు మెట్లు పైనుంచి కిందకు పడిపోయే సమయానికి పిల్లోడిని వెనక్కునెట్టి పెద్ద గండం నుంచి పిల్లవాడిని కాపాడింది. అనంతరం పిల్లోడి తిరిగి సోఫా వైపు పాకుకుంటూ వెళ్లిపోయాడు. పైనున్న వీడియోలో ఇదంతా గమనించవచ్చు. అక్టోబర్ 31న ఈ ఘటన జరగగా… దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సమయానికి తమ పిల్లవాడిని పిల్లి కాపాడకపోయి ఉంటే.. 12 మెట్ల పైనుంచి కింద పడిపోయేవాడని పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పారు. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ పిల్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పిల్లి కేవలం రహస్యంగా పాలు తాగడమే కాదని.. ఇలా పసిపిల్లలను కూడా కాపాడుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. పిల్లిని అపశకునంగా భావించే వారు ఈ వీడియోను చూడాలని మరికొంతమంది కామెంట్ చేశారు.

Related posts