telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్విట్టర్ లోకి అనుష్క శెట్టి… క్షణాల్లో 1 మిలియన్ ఫాలోవర్లు

Anushka

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే అనుష్క అభిమానులను పలకరిస్తుంది. ఫేస్ బుక్ లో అనుష్క రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫేస్ బుక్ లో అత్యధిక లైక్స్ (14 మిలియన్) కలిగిన సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీగా స్వీటీ నిలిచింది. ఇన్స్టా లో 3.8 మిలియన్ మంది స్వీటీని ఫాలో అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో అడుగు పెట్టింది అనుష్క. “హాయ్… మీరు అందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మీరందరూ నా అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించండి” అని ఫస్ట్ ట్వీట్ చేసింది. ఇక అనుష్క ట్విట్టర్ ఖాతా తెరవగానే క్షణాల్లో 1 మిలియన్ ఫాలోవర్లు అనుష్క ను ఫాలో చేశారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 2న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Related posts