టాలీవుడ్ లోకి కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్..మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించడం తో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. తాజాగా ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా ఈ భామకు తమిళ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ హాట్ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆర్.ఐ దురై స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై టి.జి త్యాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ ఛాన్స్ తో అమ్మడి జాతకం మారిపోయినట్లే..ఇక తెలుగు లో ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఓ మూవీ లో నటిస్తుంది. కె.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.