telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్‌ : 2 పరుగులతో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకోనున్న రోహిత్ శర్మ

Rohit

ఐపీఎల్‌లో అబుదాబి వేదికగా గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబయి ఇండియన్స్ టీమ్ ఢీకొట్టనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 2 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మాత్రమే ఈ మార్క్‌ని అందుకున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ 3 మ్యాచ్‌లాడగా.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 80 పరుగులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగులు చేశాడు. కోల్‌కతాపై మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదడంతో ద్వారా ఐపీఎల్‌లో 200 సిక్సర్ల మైలురాయిని కూడా ఈ హిట్‌మ్యాన్ అందుకున్న విషయం తెలిసిందే. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. 180 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 131.13 స్ట్రైక్‌రేట్‌తో 5,430 పరుగులు చేసి నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 193 మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్‌రేట్‌తో 5,368 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 191 మ్యాచ్‌ల్లో 130.97 స్ట్రైక్‌రేట్‌తో 4,998 పరుగులతో కొనసాగుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్‌కి సురేశ్ రైనా దూరమవడంతో రోహిత్ శర్మ 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడంతో పాటు నెం.2కి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

Related posts