telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చాలు..ప్రియా!

chalu priya poetry corner
చలి మంచుల్లో 
తెలివెచ్చని
కిరణాల్లా..
నడి యెండల్లో
మలిసంధ్యల 
పవనాల్లా..
నీరెండ వానల్లో 
నింగివడిలోని 
హరివిల్లులా..
వాసంత వేళల్లో 
పొంగిపూసేటి 
విరిజల్లులా..
నీతో జరిగే
కొద్ది సంభాషణ చాలు..
నారోజుకు 
ప్రశాంతత చేకూరుస్తూ …
… విశ్వైక

Related posts