telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో లోన్ యాప్ నిర్వాహకుల అరెస్ట్

లోన్ యాప్స్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. గతంలో పూణే లో ఉన్న జియా లియాంగ్ సెంటర్ పై దాడులు చేసి ముగ్గురు ని అరెస్ట్ చేసామని.. రీకవరి కాల్ సెంటర్ గా నడిపిస్తున్నారని.. పూణే కేంద్రంగా ఈ కాల్ సెంటర్ ను నడిపిస్తున్నారన్నారు. పూణే కేసులో మరింత దర్యాప్తు చేయగా వీరి వెనుక ఉన్న ఇద్దరు ప్రధాన సూత్ర దారులను పట్టుకున్నామని.. హీ జియాన్ అలియాస్ మార్క్, చైనా దేశస్తుడితో పాటు వివేక్ కుమార్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ని అరెస్ట్ చేసామని తెలిపారు. ఆన్ లైన్ లోన్ యాప్స్ తీసుకున్న వారిని మానసికంగా ఈ కాల్ సెంటర్ వాళ్ళు వేధిస్తున్నారని… వీరి వద్ద నుండి 4 ల్యాప్ ట్యాప్స్, 2 మొబైల్ ఫోన్స్, 1 ఐ పాడ్, రూటర్స్, డెబిట్ కార్డ్స్, స్టామ్స్ 03,పాస్ పోర్టుల ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అజయ్ సొల్యూషన్ సంస్థ కు చెందిన బ్యాంకు అకౌంట్ లో ఉన్న 28 కోట్ల రూపాయల ను ఫ్రీజ్ చేసామని… ఇప్పటి వరకు మొత్తం 31 కోట్లు సీజ్ చేసామని పేర్కొన్నారు. బిజినెస్ వీసా మీద వచ్చి ఇక్కడ ఇలాంటి దందాలు హీజియాన్ కొనసాగిస్తున్నాడని.. అంకుర్ సింగ్ ఇండియా కు చెందిన వ్యక్తి.. ఇతను ఈ కంపెనీ లో పనిచేశారన్నారు. చైనాకు చెందిన నాలుగు కంపెనీలు మొత్తం 24 ఆన్ లైన్ లోన్ యాప్స్ లను రూపొందించారని…ఇలాంటి లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని చాలా మంది చనిపోతున్నారని వెల్లడించారు. ఇలాంటి లోన్ యాప్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts