telugu navyamedia
సినిమా వార్తలు

“గులాబో సితాబో” చిత్రం కోసం రోజూ 3 గంటల మేకప్… : అమితాబ్

Amitab

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సైరా”లో కీలకపాత్రలో నటించారు. తమిళంలోనూ ఆయన తన తొలి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్, సాహోజిత్ సర్కార్ దర్శకత్వంలో “గులాబో సితాబో” అనే సినిమా చేస్తున్నారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ హైలైట్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ వృద్ధుడి పాత్ర గెటప్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. పాత్ర నిమిత్తం వదులు చొక్కా, తలచుట్టూ వస్త్రం, నెరిసిన గుబురు గడ్డం, కళ్లజోడు ధరించిన అమితాబ్ బచ్చన్ ప్రచార చిత్రం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. ఈ లుక్ కోసం తనకు ఎన్ని గంటలపాటు మేకప్ చేశారన్న ఆసక్తికర విషయాన్ని అమితాబ్ ప్రస్తావించారు. ప్రతిరోజూ మూడు గంటల సమయం పట్టేదని, మేకప్ అంతా పూర్తయిన తర్వాత తన పరిస్థితి ఇదీ అంటూ తన గెటప్ కు సంబంధించిన ఫొటోను, మేకప్ రూమ్ లో తీసిన మరో ఫొటోను అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇంతముకుందెన్నడూ అమితాబ్ ఇలాంటి లుక్ లో కన్పించలేదు. షీలా కుమార్, రోనీ లాహిరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌లో అమితాబ్ గత మంగళవారం నుంచి పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 24, 2020లో విడుదల కానుంది.

Related posts