telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

ఈ రోజు మీ రాశి ఫలితాలు .. ఏమంటున్నాయంటే..

Today Rasi Phalalu

మేషం
కొన్ని ఫలితాలు ఆలస్యమవుతాయి. మనో నిబ్బరంతో ముందుకెళ్లండి. ప్రణాళికలతో కార్యాలు సిద్ధిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. తడబాటు పనికిరాదు. ఒత్తిడి అధికమవుతుంది. ఓర్పు అవసరం. వివాదాలకు అవకాశముంది. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడండి. నవగ్రహ స్తుతి శక్తిని ప్రసాదిస్తుంది.

వృషభం
పెద్దవారి వల్ల మేలు జరుగుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఇష్టకార్యాలు పూర్తి అవుతాయి. ఒక సంఘటన మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసభ్యుల ప్రమేయంతో కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. గృహ, వాహన యోగాలున్నాయి. శని ధ్యానం ఉత్తమ ఫలాన్నిస్తుంది.

మిథునం
సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నట్లే ఫలితాలు వస్తాయి. సందర్భానుసారంగా మాట్లాడి పెద్దల మన్ననలు పొందుతారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. అధికార లాభముంది. గతంకంటే ఉత్తమ కాలం. మిత్రులవల్ల మేలు జరుగుతుంది. మీకు సంబంధించని విషయాల మీద దృష్టి పెట్టవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. ఇష్టదేవతా దర్శనం మంచిది.

కర్కాటకం
ఉత్తమ కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. ధనలాభం ఉంది. వ్యయం పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. జ్ఞానం వృద్ధిచెందుతుంది. శుభవార్తలు వింటారు. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది.

సింహం
ఆర్థికాంశాలు బాగున్నాయి. పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ప్రలోభాలకు గురిచేసేవారున్నారు, జాగ్రత్త. ప్రతి అంశాన్నీ లోతుగా చూడకండి. తెలివి తేటలతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుకున్నది లభిస్తుంది. చిక్కుముడులు వీడతాయి. శాంతి లభిస్తుంది. వారాంతంలో కార్యాలు సిద్ధిస్తాయి. శివారాధన ఉత్తమం.

కన్య
ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. చంచల స్వభావం పనికిరాదు. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇబ్బంది కలిగించాలని చూసేవారున్నారు. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి. తోటివారి సహకారం అవసరం. ఆంజనేయస్వామిని దర్శించండి.

తుల
అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీర్తిప్రతిష్ఠలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అంతా మీరు ఊహించినట్లే జరుగుతుంది. ఉత్తమ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయండి. ధన, వ్యాపార లాభాలున్నాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం
ప్రయత్నం ఫలిస్తుంది. సమస్యలు తీరతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పునః ప్రారంభమవుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చంచల మనస్తత్వం పనికిరాదు. కుటుంబసభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతస్థితి లభిస్తుంది. గృహలాభం సూచితం. గణపతి ధ్యానం శుభాన్నిస్తుంది.

ధనుస్సు
అభీష్టాలు సిద్ధిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం విజయం సాధించాలి. అనేక విధాలుగా అవరోధాలు ఎదురవుతాయి. తెలివితో వాటిని అధిగమించాలి. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. విష్ణుసహస్రనామం ఉత్తమ ఫలాన్నిస్తుంది.

మకరం
అనుకున్నది సాధిస్తారు. పనుల్లో పురోగతి ఉంటుంది. అదృష్టయోగముంది. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. సహకరించే వారున్నారు. నమ్మకంతో పనులు ప్రారంభించండి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కొందరికి సహాయపడటం వల్ల ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. వారాంతంలో గొప్ప విజయం లభిస్తుంది. దుర్గాధ్యానం విజయాన్నిస్తుంది.

కుంభం
ధనయోగముంది. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అదృష్టవంతులవుతారు. ఒక విషయంలో ఫలితం చివరి వరకు వచ్చి ఆగుతుంది. ఆపదలు తొలగుతాయి. వస్తు లాభముంది. దగ్గరివారి నుంచి శుభవార్త వింటారు. వారాంతంలో ఒక మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శాంతినిస్తుంది.

మీనం
శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసివస్తుంది. ఓర్పుతో పనులు పూర్తిచేయండి. అద్భుతాలు జరుగుతాయి. అభివృద్ధి చెందుతారు. దైవశక్తి రక్షిస్తోంది. అధికారుల వల్ల మేలు కలుగుతుంది. లక్ష్యంపై శ్రద్ధ పెంచండి. వ్యతిరేకతలు తొలగుతాయి. మిత్రబలం పెరుగుతుంది. విశ్రాంతి అవసరం. శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభదాయకం.

Related posts