మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్ . ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది ఈమె. మహానటి తర్వాత ఈమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నా కూడా ఈమె మాత్రం కథల విషయంలో చాలా కేరింగ్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దేలో నటిస్తుంది. ఇప్పుడు మరో లెజెండరీ నటి బయోపిక్‌లో నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. కృష్ణ భార్య దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందించాలని ఆమె తనయుడు నరేష్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను టైటిల్ రోల్ కోసం తీసుకోవాలని చూస్తున్నాడు నరేష్. అయితే ఈ పాత్ర చేయడానికి కీర్తి చాలా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన విజయ నిర్మల 50 సినిమాలకు దర్శకత్వం కూడా వహించి రికార్డు సృష్టించింది. ఆమె పాత్రలో కీర్తి నటిస్తే మాత్రం సంచలనమే అవుతుంది.
previous post
next post