telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు..

మంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌ ఈ మధ్యకాలంలో ఫ్ర స్ట్రేషన్‌లో ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ వాడుతున్న భాష కూడా సరిగా లేదని…కేసీఆర్‌ కొడుకు కాబట్టే..అలాంటి భాషను వాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌కు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ వరద బాధితులకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న సాయం..జనాలు పన్నుల రూపంలో కట్టిన డబ్బేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచే ఈ సాయం చేశారని స్పష్టం చేశారు. ప్రజల డబ్బును వారికే ఇస్తూ..టీఆర్‌ఎస్‌ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్‌ రావు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బేనని వెల్లడించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఏడు చెరువుల నీళ్లు తాగించామని ఎంపీ అరవింద్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్‌ ఓడిపోవడం ఖాయమని హెచ్చరించారు. అక్రమ కట్టడాలను కూల్చడంలో ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాలని కేటీఆర్‌కు సూచించారు ఎంపీ అరవింద్‌.

Related posts