కియరా పేరు వింటేనే కుర్రకారు వెర్రెకిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర కథానియికల జాబితాలో కియారా కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తతం ఈ అమ్మడు కోసం క్యూలు కడుతున్నారు. ఈ ముద్దు గుమ్మ తెలుగులో రెండు సినిమాలు చేసింది. వాటిలో ఒకటి బంపర్ హిట్ అయితే ఒకటి మాత్రం ఫట్టయింది. అయినాసరే ఈమెను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తరువాత బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లోనూ తన మొదటి సినిమా డిసాస్టర్ అని చెప్పింది. అయితే అందరూ తాను ధోనీ సినిమాతో సిల్వర్ స్రీన్‌కు పరిచయం అయ్యాననుకుంటారు. కానీ దానికన్నా ముందు బాలీవుడ్‌లో 2014లో ఫగ్లీ అనే సినిమాలో నటించాను. అదే నా మొదటి సినిమా. ఆ సినిమా డిసాస్టర్‌గా మిగలడంతో నాకు బాలీవుడ్‌లో ఇక అవకాశాలు రావని, నా నటనా జీవితం ఇక తుది దశకు చేరుకుందనుకున్నా, కొన్నాళ్ల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆతరువాత మళ్లీ సినిమాల్లో అవకాశాల కాసం ప్రయత్నాలు మొదలు పెట్టా. ఎంతకి ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో నిరాశకు లోనయ్యా. అయినా నా ప్రయత్నాలను ఆపలేదు. చాలా సమయం తరువాత అనుకోని రీతిలో ధోనీ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. దాంతో నా జీవితమే మారిపోయింది. అప్పుడు ధోనీ అవకాశం రాకపోయి ఉంటే ఇప్పుడు ఈ కియారా తెరపై ఉండేది కాదని చెప్పుకొచ్చింది.
previous post