భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన విషయం విదితమే. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే హిందీలో రీమేక్ చేయడానికి ప్రముఖ హిందీ డైరెక్టర్ కరణ్ జోహార్ ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకోవడమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. హిందీలో ఈ సినిమా కోసం షాహిద్ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్ భావించారని, ఈ సినిమా కోసం షాహిద్ ఏకంగా రూ.40 కోట్లు అడిగారని, ఆ డిమాండ్‌కు కరణ్ కూడా ఓకే అన్నట్టు వార్తలొచ్చాయి. కానీ “డియర్ కామ్రేడ్” తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే సందేహంతో షాహిద్ వెనుకకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా “డియర్ కామ్రేడ్” డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సరిగ్గా సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. దీంతో విజయ్ అభిమానులు సినిమాను మరోసారి చూస్తూ… ట్వీటర్‌లో కామెంట్స్ పెడుతుండడంతో ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” ట్వీటర్‌లో ట్రెండ్ అవుతోంది.
#DearComrade is now streaming on @PrimeVideoIN @TheDeverakonda @iamRashmika @bharatkamma @justin_tunes @MythriOfficial @YashBigBen @bigbencinemas pic.twitter.com/tPaL90SmoE
— Ramesh Bala (@rameshlaus) 30 August 2019