telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మూడు రాజ‌ధానులపై బొత్స ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు..

*మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం..
*అభివృద్ధివికేంద్రీకరణ మా విధానం..
*త్వ‌ర‌లో అసెంబ్లీలో బిల్లులు పెడ‌తాం..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో బిల్లుపెట్టే అంశంపైనా ఆలోచిస్తున్నామన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందని.. అందులో కూడా పాలన వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారని. దానిని మేం తీసుకున్నామని తెలిపారు.

మరోవైపు, జిల్లాల పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందన్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతల మాటల తమకు ప్రామాణిక‌మేమీ కాదని బొత్స ఎద్దేవా చేశారు.

కాగా.. రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.. ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts