telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ తో అమరావతి రైతుల భేటీ

jagan

ఏపీ సీఎం జగన్ ను రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఈ రోజు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో రైతులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి ఆధ్వర్యంలో రైతులతో ఈ చర్చలు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. తాను ఉండవల్లి రైతు బిడ్డను అని, ప్లీడర్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని మహిళ నిర్మల అన్నారు.

రెండున్నర గంటలసేపు తమతో సీఎం చర్చలు జరిపారని, ప్రతి రైతుతో ఆయన మాట్లాడారని, రైతు సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని, తమ పొలాలు తమకు మిగిలేలా చూడాలని విన్నవించుకున్నామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

Related posts