telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు: మంత్రి ఐకె రెడ్డి

indrakaran reddy minister

ప్రభుత్వం రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తుందన్నారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి..రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. కందులు క్వింటాలుకు 5800 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా రైతులకు నగదు చెల్లింపు చేయడం జరుగుతుందన్నారు. రైతు సమన్వయ సమితీలను బలోపేతం చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Related posts