telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడులో టీఆర్‌ఎస్‌కు అసమ్మతి సెగ, రంగంలోకి జగదీష్ రెడ్డి

తెలంగాణలో రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక పైనే అంద‌రిదృష్టి. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్‌ పెట్టాయి.

ఈ నేపథ్యంలో అక్కడి అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో టీఆర్ ఎస్ పడింది. దీనిలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో కీలక భేటీ నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, కలిసి పనిచేయాలని మంత్రి వారికి సూచించారు.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొదని వారు అసమ్మతి గళం వినిపించారు. కూసుమంట్లకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో సపోర్టు చేసేదిలేదంటు తేల్చి చెప్పారు.

ఈ విషయంపై వారం క్రితమే సీఎం కేసీఆర్‌కు అసమ్మతి నేతలు లేఖలు రాసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీష్‌ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts