telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇక వారి అకౌంట్లలో 31 వేల రూపాయలు జమ : నరేంద్ర సింగ్‌

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రినరేంద్ర సింగ్‌ తోమర్‌… అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే “నేషనల్‌ స్టాండర్డ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌” ప్రకారం ఏడాది పొడుగునా సాగుచేసే పంటలు, సాంప్రదాయ సేద్యం నుంచి సేంద్రీయ సేద్యానికి మారడానికి మూడేళ్ళ కాలపరిమితి ఉంటుంది. ఈ మార్పు జరిగే కాలంలో రైతులు తమ భూములను ఖాళీగా పెట్టకుండా ఎన్‌ఎస్‌ఓపీ ప్రమాణాలను అనుసరించి సేద్యం చేసుకోవచ్చు. ఆ విధంగా సాగు చేసిన భూముల్లో పండిన పంటను సేంద్రీయ సాగుకు మారుతున్న పంటగా గుర్తించి విక్రయించుకోవచ్చు. పీకేవీవై పథకం కింద సేంద్రీయ సేద్యం చేసే రైతులకు మూడేళ్ళపాటు హెక్టారుకు 31 వేల రూపాయల చొప్పున నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలో ప్రభుత్వం సొమ్మును జమ చేస్తుంది అని తెలిపారు. ఈ సొమ్ముతో రైతులు బయో ఫెర్టిలైజర్స్‌, బయో పెస్టిసైడ్స్‌, ఆర్గానిక్‌ మేన్యూర్‌, కంపోస్టు, వర్మి కంపోస్టు, బొటానికల్‌ ఎక్స్‌ట్రాక్స్ట్‌ కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. అలాగే ఈ పథకం కింద సేంద్రీయ సేద్యం చేసే రైతులకు పంట వేయడం నుంచి పంట దిగుబడికి సర్టిఫికేషన్, మార్కెటింగ్‌ వరకు అన్ని దశలలో ప్రభుత్వం చేదోడుగా ఉంటుంది అని తెలిపారు.

Related posts