telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

తిరుమలలో కరోనా విభత్సం… 57 మంది విద్యార్థులకు పాజిటివ్‌

tirumala guest house

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.90 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,90,884 కు చేరింది. ఇందులో 8,82,670 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1038 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా శ్రీవారి సన్నిది తిరుమలలో మరోసారి కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా…మళ్లీ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా తిరుమలలోని 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా సోకింది. గత నెలలోనే ఈ పాఠశాల ప్రారంభం కాగా… 450 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అయితే ఈ పరీక్షల్లో ఏకంగా 57 మందికి కరోనా సోకింది. దీంతో ఆ విద్యార్థులను తిరుపతిలోని స్విమ్స్‌కి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్‌ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్న వారిని క్వారంటైన్‌లో ఉంచారు. వేదపాఠశాలలో కరోనా విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Related posts