సినీ తారలు అభిమానుల వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా చాలామంది తమ అభిమానులు తమ అభిమాన తార ఎక్కడైనా కన్పించగానే సెల్ఫీలు తీసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే ఒక్కోసారి వారి అతి ప్రవర్తన కారణంగా తారలు ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి కత్రిన కైఫ్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఆమె బయటకు వస్తుండగా… అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీలకు ప్రయత్నించారు. వారిలో ఒకరు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కత్రినాకు మరింత దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించగా… సెక్యూరిటీ గార్డులు అతన్ని లాగేశారు. అయినా అతను వదల్లేదు. మరోసారి ఆమె ముందుకు వచ్చి, “మేడమ్.. ఒక్క సెల్ఫీ” అని కోరాడు. దీంతో కత్రినా అతని కోరికను మన్నిస్తూనే “నిదానంగా… దగ్గరికి రావద్దు. అక్కడి నుంచే సెల్ఫీ దిగు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
previous post