telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదటి పంజాబీ రంగస్థల నటి ఉమా గుర్బక్ష్‌ సింగ్‌ కన్నుమూత

Uma

మొదటి పంజాబీ రంగస్థల నటి, నవలా రచయిత గుర్బక్ష్‌ సింగ్‌ ప్రీత్లారి కుమార్తె ఉమా గుర్బక్ష్‌ సింగ్‌ కన్నుమూశారు. 93 సంవత్సరాల వయసున్న ఆవిడ సుదీర్ఘ అనారోగ్యంతో శనివారం అమృత్‌సర్‌లో కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె స్వగ్రామంలో ఆమె అంతిమ సంస్కరణలు చేశారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి రాసిన ’రాజ్‌కుమారి లతిక’ ’నాటకంలో నటించినప్పుడు గుర్బక్ష్‌ వయసు కేవలం 13 సంవత్సరాలు. స్వాతంత్య్రానికి ముందు, ఆమె అనేక నాటకాలను ప్రదర్శించింది. 1944 లో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ”హల్లే హులారే ” నాటకాన్ని ప్రదర్శించినందుకు ఆమెతో పాటు మరో ఏడుగురు కళాకారులతో ఆమె జైలు శిక్ష అనుభవించారు. గుర్బాక్‌ సింగ్‌ నానక్‌ సింగ్‌ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శిగా ఆమె తమ్ముడు హిర్దెపాల్‌ సింగ్‌ వ్యవహరిస్తున్నారు. 

Related posts