telugu navyamedia
సినిమా వార్తలు

వీడియో : పెళ్లిలో మందుతో చిందేస్తున్న రకుల్

Rakul-Preeth

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్, టబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “దేదే ప్యార్‌ దే” అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక పెళ్ళైన, తనకంటే వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తిని లవ్ చేసే పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి “వడ్డీ షరాబన్” అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో రకుల్ అందాలను ఆరబోసింది. పెళ్లిలో మందుతో చిందేస్తూ హుషారెత్తించింది. ఈ పాట విడుదలైన గంటల వ్యవధిలోనే యూట్యూబ్ లో 9 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై ట్విట్టర్ ద్వారా రకుల్ ఇది గొప్ప అనుభవమని, “వడ్డీ షరాబన్” పాట షూటింగ్ చాలా సరదాగా జరిగిందని తెలిపింది. ఇంత మంచి పాటను తనకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్రంలో జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ కీలక పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts