telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అజయ్ దేవగణ్ సోదరుడు మృతి

Ajay-Devgan

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు అనిల్ దేవగణ్ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగణ్‌ను కోల్పోయాను. ఆయన అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అజయ్ దేవగణ్ ఫిలింస్ (ADFF), నేను ఆయన ప్రియమైన ఉనికిని కోల్పోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. ప్రస్తుత ఆందోళన పరిస్థితుల కారణంగా మేం వ్యక్తిగత సంతాప సభను ఏర్పాటు చేయడంలేదు” అని అజయ్ దేవగణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అజయ్ ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు. అజయ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక అజయ్ హీరోగా వచ్చిన ‘రాజు చాచా’, ‘బ్లాక్‌మెయిల్’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే ‘సన్ ఆఫ్ సర్దార్’కు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కాగా అజయ్ దేవగణ్ తండ్రి, బాలీవుడ్ స్టంట్ మాస్టర్ వీరు దేవగణ్ గతేడాది మరణించారు.

Related posts