telugu navyamedia
సినిమా వార్తలు

దాసరి ఆస్తి వివాదంపై మోహన్ బాబు వివాదం

Mohanbabu demand fees reimbursement

దాసరి శిష్యుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో దాసరి లఘు చిత్రాల బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటులు జయసుధ, ఆర్.నారాయణమూర్తితో పాటు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను పలువురు నిరుపేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ లను అందించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు దాసరి గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.దాసరిగారు ఆయన ఆస్తుల పంపకం విషయంలో తనను, మురళీమోహన్ ను ఎంతగానో నమ్మారని, వీలునామాలో పర్యవేక్షకులుగా ‘మోహన్ బాబు, మురళీమోహన్’ అని ప్రత్యేకంగా తమ పేర్లు కూడా రాయించారని వెల్లడించారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదన్నది దాసరి గారి ఉద్దేశం అని, అందుకే తామిద్దరి పేర్లు వీలునామాలో పొందుపరిచారని వివరించారు. కానీ, తమ అసమర్థత కారణంగా దాసరి గారి ఆస్తుల పంపకాలను సక్రమంగా నిర్వర్తించలేకపోయామని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని చేశాం, మరికొన్ని చేయలేకపోయాం, అందుకు గల కారణాలు ఏంటో దాసరి కుటుంబానికి, నటి జయసుధకు తెలుసని అన్నారు. అయితే, తనవంతుగా గురువుగారికి ఎంతో చేశానని మోహన్ బాబు వెల్లడించారు. తిరుపతిలో దాసరి పేరుతో 500 మంది విద్యార్థులు కూర్చునే విధంగా ఆడిటోరియం కట్టించానని, ఇది ఆసియాలోనే అత్యుత్తమం అని పేర్కొన్నారు.

Related posts