telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జస్ప్రీత్ బుమ్రాతో అనుపమ డేటింగ్‌… చెప్పకనే చెప్పేసిందిగా…!

Bumrah-and-anupama-parameshwaram

అనుపమ నటించిన “రాక్షసుడు” సినిమా తర్వాలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా నటించాడు. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘రాట్‌ససన్’ చిత్రం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం అనుపమ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అనుపమను బుమ్రాతో డేటింగ్ గురించి ప్రశ్నించారు. బుమ్రా మీకు ఫ్రెండా లేకపోతే అంతకంటే ఎక్కువా.? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే దీనిపై ‘నో కామెంట్స్, ఆ విషయం గురించి నేను మాట్లాడను. వేరే విషయాలు అడగండి’’ అని అనుపమ సమాధానం ఇచ్చింది. దీంతో అనుపమ, బుమ్రా మధ్య ప్రేమాయణం నడుస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా.. ఓ హీరోయిన్‌తో కనిపిస్తే చాలు వారిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు పుట్టుకు రావడం సోషల్‌మీడియాలో కామన్ అయిపోయింది. హార్థిక్ పాండ్యా, ఎల్లీ అవ్‌రమ్, కేఎల్ రాహుల్, నిధి అగర్వాల్ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందని ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసేశారు. తాజాగా టీం ఇండియా బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రాతో టాలీవుడ్ బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉందని వార్త వైరల్‌ అయింది. బుమ్రా చేసిన పోస్ట్‌లపై అనుపమ కామెంట్ చేయడం.. వాటికి బుమ్రా స్పందించడం. వీరిద్దరు ఒకే రకమైన పోస్ట్‌లు పెట్టడం వంటివి జరగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిపై బుమ్రా కానీ అనుపమ కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అయితే మొట్టమొదటి సారిగా అనుపమ ఈ విషయంపై స్పందించింది.

Related posts