సాధారణంగా మనకు తెలిసినంతలో తులసి ఆకులు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే తాజాగా తేల్చిన విషయం ఏమంటే, ఆకులతో పాటుగా తులసి విత్తనాలలోనూ ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయి. తులసి విత్తనాలను తింటే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి తులసి విత్తనాలను రోజూ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..!
* తులసి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈ యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.
* వయస్సు మీద పడడం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గాలంటే నిత్యం తులసి విత్తనాలను తింటుండాలి.
* తులసి విత్తనాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది.
* తులసి విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను పోగొడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది.
* రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే వారు తులసి విత్తనాలను తింటే ఫలితం ఉంటుంది.
* తులసి విత్తనాలను నిత్యం తింటుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది.
* తులసి విత్తనాల్లో ఉండే విటమిన్ కంటి సమస్యలను పోగొడుతుంది. చూపును మెరుగు పరుస్తుంది.
* తులసి విత్తనాల్లో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.