telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమెరికాకు .. చైనా హెచ్చరికలు.. సత్తా చూపిస్తాం.. !

china warning to america on trade war

రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య పోరు ప్రపంచానికి చేటు చేస్తుంది. ఒకరిపై ఒకరు ఇష్టానికి పెట్టుకుంటున్న వాణిజ్య ఆంక్షలు యుద్ధమేఘాలను తలపిస్తున్నాయి. చైనా, అమెరికాలు అగ్రదేశాలు ఒకరి మార్కెట్లపై మరొకరు కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపడం తెలిసిందే. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీస్థాయిలో సుంకాలు పెంచేశారు. ఈ నేపథ్యంలో, చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ప్రస్తుత వివాదాలపై చర్చలకు వస్తే ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఒకవేళ వాళ్లు తమతో ఘర్షణలను కోరుకుంటే మాత్రం తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వాణిజ్యపరమైన ప్రతిష్టంభనలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే చైనా విధానమని, చైనా ఎప్పుడూ దౌర్జన్యం చేయదని ఫెంఘే అన్నారు. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించాలన్న ఆశ, ఆశయం చైనాకు ఏమాత్రం లేదని, అమెరికాను తోసిరాజని తాము ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయించాలని కోరుకోవడంలేదని స్పష్టం చేశారు.

Related posts