telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ, హైదరాబాద్ కు భూకంపాలు రావని ఎప్పుడు చెప్పలేదు…

4 earthquakes in arunachal pradesh

తెలంగాణకు, హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని ngri శాస్త్రవేత్త నగేష్ చెప్పారు. తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలమని..బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో భూకంపం వచ్చిన మాట వాస్తవమేన్నారు. భూమి పొరల్లో వచ్చిన వత్తిడి, పగుళ్ల వల్లే భూమి కంపించిందని…ఇష్టానుసారంగా బోర్లు వేయడం, భూమి లోపల నీటి ఆనవాళ్లు లేకపోవడంతో భూమిలో పొరలు కదులుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కూడా భూప్రకంపనలకు కారణమేనని..ఒకసారి భూకంపం వస్తే కొద్ది రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించారు. మళ్ళీ మళ్ళీ భూమిలో శబ్దాలు రావొచ్చని.. కానీ దాని తీవ్రత ఎక్కువగా ఉండదని తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలి మై హోమ్స్ విహంగ, ఐఐఐటీ ప్రాంతాల్లో సిస్మో మీటర్లు ఏర్పాటు చేసామని వెల్లడించారు. కాగా 10 రోజులక్రితం బోరబండ భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ విషయం మరువకముందే…బోరబండలో మరో సారి భూమి కంపించింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. 

Related posts