దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ పాల్గొన్నారు. చేగుంట మండలంలోనిపలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కేఎల్లార్. ఈ ప్రచారంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… మంత్రి హరీష్ రావు మాటలకు హద్దే లేదు… ఉప ఎన్నికల్లో ఏదో విధంగా ఓట్లు దండుకోవడం ఆయనకు తెలుసు అని చెప్పారు. తెరాస నేతలు అయిన అల్లుడు, కొడుకు చంద్రశేఖర రావు సంపాదించిన అక్రమ సంపాదన ప్రజలది అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ అవినీతి, అప్పుల బారి నుంచి కాపాడడానికి ప్రశ్నించే గొంతుక అయిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలి అని అన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ఫాం హౌస్ లో నుండి బయటకు రావాలంటే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి అని చెప్పారు. గడీల పాలన మనకు వద్దని ప్రజల పాలన చేసిన దివంగత రాజశేఖర్ రెడ్డి లాగా ఉండాలి అని సూచించారు.
previous post
చంద్రబాబు చచ్చిన విషసర్పం..