telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలు రైతులకు స్వేచ్ఛను కల్పిస్తాయి: మోదీ

Modi Mask

వ్యవసాయ చట్టాలు రైతులకు స్వేచ్ఛను కల్పిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మోదీ స్పందించారు. ప్రతి మంచి పనిని నిరసిస్తూ ఆందోళన చేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు.

ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సంస్కరణనలను తీసుకొచ్చామని మోదీ అన్నారు. తాము తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులు, యువత, మహిళలు, రైతులను శక్తిమంతులను చేస్తుందని చెప్పారు.

తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కొత్త చట్టంతో రైతులకు లభించిందని మోదీ చెప్పారు. రైతులకు వారి హక్కులను కేంద్రం కల్పిస్తోందని తెలిపారు. ఇదే సమయంలో దాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఓపెన్ మార్కెట్లో రైతులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడం వారికి ఇష్టం లేదని అన్నారు. దళారులు బాగుపడాలనేదే వారి ఆలోచన అని దుయ్యబట్టారు.  రైతుల స్వేచ్ఛను వారు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Related posts