telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

సినీ పరిశ్రమ విరాళాల గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే..?

pawan

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో… చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. అయితే వరద సాయం, విరాళాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో సినిమా స్టార్లు చేసిన సాయం తక్కువని వస్తున్న అభిప్రాయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. సినిమా వాళ్లకు పేరు ఎక్కువ ఉంటుంది కానీ డబ్బు ఉండదని పవన్ అన్నారు. సినిమా వాళ్ళతో పోలిస్తే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద బాగా డబ్బు ఉంటుందన్నారు. నేతలు దీన్ని ఎన్నికల పెట్టుబడిగా భావించి విరాళాలు ఇవ్వాలని కోరారు పవన్. తెలంగాణాలో ప్రో యాక్టీవ్ ముఖ్యమంత్రి ఉండటంతో అడిగిన వెంటనే అంతా విరాళాలు ఇస్తున్నారని చెప్పారు పవన్. ఇక వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్. అయితే చిత్రసీమ లో ప్రభాస్, చిరంజీవి, మహేష్‌బాబు కోటి రూపాయల చొప్పున… నాగార్జున, ఎన్టీఆర్‌ 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ట్వీట్లు చేశారు. రామ్‌ 25 లక్షలు, విజయ్‌దేవరకొండ 10 లక్షలు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 10 లక్షలు, హాసిని అండ్‌ హారికా క్రియేషన్స్‌ యజమానులు 10 లక్షలు విరాళం ప్రకటించారు

Related posts