telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్

Sona

మీటూపై షాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ గాయని సోనా మొహాపాత్ర ఒకరు. ప్రముఖ గాయకుడు అను మాలిక్ ‌తనను లైంగికంగా వేధించాడని ఏడాది క్రితం సోనా షాకింగ్ ఆరోపణలు చేశారు. మ్యాటర్ సీరియస్ అవడంతో ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్‌ను తొలగించారు. ఈ షోకు ఆయన జడ్జ్‌గా వ్యవహరించేవారు. అను మాలిక్‌పై మీటూ ఆరోపణలు ఉన్నప్పటికీ అతన్ని మళ్లీ ఇండియల్ ఐడల్ సీజన్ 11 జడ్జ్‌గా నియమించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ‘ఇండియన్ ఐడల్ షోలో అను మాలిక్ ఉన్నాడు. అతను సోనా మొహాపాత్రను లైంగికంగా వేధించాడు. షో నుంచి తొలగించాక మళ్లీ ఏడాది తర్వాత అదే షోలో జడ్జ్‌గా కూర్చోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. ఎంతో ధైర్యంతో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టిన నటీమణులు, ఫీమేల్ సింగర్ల ప్రయత్నం వేస్ట్ అయిపోయింది’ అని పేర్కొన్నాడు. దీనిపై సోనా మొహాపాత్ర స్పందిస్తూ… “దీనంతటికీ కారణం సోనూ నిగమ్. అను మాలిక్‌కు కావాల్సినంత పబ్లిసిటీ కల్పించాడు. అను మాలిక్ కూడా ఓ తల్లికి బిడ్డే అని నేరం రుజువు అయ్యేంతవరకు ఆయన్ను జడ్జ్‌గా ఉండనివ్వాలని అన్నాడు. దాంతో షో నిర్వాహకులు మళ్లీ అను మాలిక్‌ను నియమించుకున్నారు. సోనూ ఇంతటితో ఆగలేదు. నా కాపురంలో నిప్పులు పోశాడు. నా భర్తకు నా గురించి లేనిపోనివి చెప్పాడు. నన్ను టెర్రరిస్ట్ అన్నాడు. నాపై ఓ కన్నేసి ఉంచాలని నా భర్తకు లేనిపోనివి నూరిపోశాడు. ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీటూ’ ఉద్యమం వల్ల చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అందరూ ఆశించారు. కానీ ఎవరి పేర్లైతే బయటికి వచ్చాయో వారందరూ ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పలువురు దర్శకులు, ప్రొడ్యూసర్లు, నటులు, సింగర్ల పేర్లు బయటికి వచ్చాయి. వారిని పని నుంచి తొలగించారు కూడా. సరిగ్గా ఏడాది తర్వాత వారంతా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. దాంతో ఆరోపణలు చేసిన వారికి న్యాయం జరగకుండా పోయింది. బాధితుల్లో ప్రముఖ బాలీవుడ్ గాయని సోనా మొహాపాత్ర ఒకరు.

Related posts