telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరీంనగర్ అభివృద్ధిలో వైస్ దే కీలక పాత్ర : షర్మిల

కరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ కామన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోంది అని ఆవిడ అన్నారు. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుంది. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం. సింగరేణి మనకు తలమానికం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు. వైఎస్సార్ కి కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. అప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చింది కరీంనగర్ రైతుల జిల్లా రైతుల కష్టాలు చూసే అన్నారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారు.బ్యాంకుల ద్వారా రుణాలు నేతన్నలు ఇప్పించారు. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అని అనడానికి రాజశేఖర్ రెడ్డి కారణం. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎల్లంపల్లి, మిడ్ మనేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ ది అని పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు. రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎస్సార్ ది. అందుకే కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర చాలా ఉంది అన్నారు. అక్కడ ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనీది అని అన్నారు.

Related posts