telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ సమస్యను భారత్ -పాక్ లు పరిష్కరించుకోవాలి: ట్రంప్

trump in america president election race

కశ్మీర్ సమస్యను భారత్ -పాక్ లు పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ చెప్పారు. మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ మంచి వ్యక్తులని… వారిద్దరూ కలసి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారనే నమ్మకం తనకుందని తెలిపారు.

ఏ వ్యక్తి సహకారాన్నైనా కావాలని వారు కోరుకుంటే, దానికి తాను సిద్ధమని అన్నారు. ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తో తాను చాలా సిన్సియర్ గా చెప్పానని ట్రంప్ అన్నారు. వారిద్దరూ తన మధ్యవర్తిత్వాన్ని కోరితే… తప్పకుండా కశ్మీర్ అంశంలో కలగజేసుకుంటానని చెప్పారు. జూన్ లో జపాన్ లో జరిగిన జీ-20 సమ్మిట్ లో కశ్మీర్ విషయంలో కలగజేసుకోవాలని మోదీ తనను కోరినట్టు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి లోక్ సభలో మాట్లాడుతూ, మోదీ, ట్రంప్ లు చర్చిస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని, మోదీ నుంచి ట్రంప్ కు అలాంటి ప్రతిపాదన వెళ్లలేదని స్పష్టం చేశారు.

Related posts