telugu navyamedia
సినిమా వార్తలు

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి నాగబాబు వార్నింగ్

Nagababu
మెగా బ్రదర్ నాగబాబు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి టీవీ ఛానెల్ సాక్షిగా వార్నింగ్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే… కొన్నిరోజుల క్రిత్రం నాగబాబు జనసేన పార్టీకి తనవంతు విరాళంగా పాతిక లక్షలు ఇచ్చారు. అంతేకాదు తన కొడుకు వరుణ్ తేజ్ తో కూడా మరో కోటి రూపాయలు విరాళంగా ఇప్పించారు. ఈ విరాళాలపై పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ నుంచో తీసుకొచ్చిన సొమ్మును తన కొడుకు ఖాతాలో వేసి, దాన్నే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చారని పృథ్వీ అన్నారు. 
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నాగబాబుని ఈ విషయమై ప్రశ్నించగా స్పందించిన ఆయన “ఫండ్ గురించి పృథ్వీ కామెంట్ చేశాడా..? రేయ్ పృథ్వీ రేపు ఫోన్ చేయరా.. ఈ ప్రశ్నకి నేను నీకే సమాధానం ఇస్తాను.. పృధ్వీ నీకే చెబుతున్నా.. రేప్పొద్దున ఫోన్ చెయ్.. నా నెంబర్ నీ దగ్గర ఉంది” అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రేక్షకులకు స్పష్టతనివ్వాలని ఇంటర్వ్యూలో కోరగా… “ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, తన అకౌంట్ నుండి పాతిక లక్షలు, కొడుకు ఖాతా నుండి కోటి ఇచ్చామని, కావాలంటే అకౌంట్ చెక్ చేసుకోండి అని, అది బ్లాక్ మనీ కాదని చెప్పుకొచ్చారు.

Related posts