telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కరోనా’ వైరస్ ఫై మంచులక్ష్మి వీడియో వైరల్

Manchu-Lakshmi

సెలబ్రిటీలు కరోనా వైరస్ గురించి కొంతమంది జాగ్రత్తలు చెబుతుంటే చార్మి, వర్మ లాంటి వాళ్లు జోకులు పేలుస్తున్నారు. చార్మి అయితే కరోనా వైరస్ తెలంగాణకు వచ్చేసిందట అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి పరువు పోగొట్టుకుంది. ఈ సందర్భంలో కరోనా వైరస్‌పై మంచు లక్ష్మికి సంబంధించిన ఓ ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కరోనా వైరస్‌లో లింక్ చేసి సోషల్ మీడియాలో పొట్టచెక్కలు చేసే వీడియోను వదిలారు. నిజంగానే కరోనా వైరస్ గురించి మంచు లక్ష్మి ఇలా మాట్లాడిందా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో కథాకమీషు ఏంటో తెలుసుకుందాం. ‘కరోనా’ వైరస్ కాదని.. కర్రోనా వైరస్. అండ్ ది ఆర్ షుడ్ బీ రోలింగ్. అంటే.. ఆర్ అనేది రోల్ అవ్వాలన్నమాట. ఆర్ కిందపడి దొర్లాలన్న మాట’ అంటూ మంచు లక్ష్మి ‘కరోనా’లో ఆర్‌ని ఎలా పలకాలో క్లాస్ పీకుతోంది. ‘నీలు’ అనే టిక్ టాక్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో మంచి లక్ష్మి ‘ఆర్’ని ఎలా పలకాలో చెప్తున్నది ఇప్పటిది కాదు.. అది అపుడెపుడో సైమా అవార్డ్స్ వేడుకలో మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి ఇదిగో ఇలా కరోనా వైరస్‌కి వాడేస్తున్నారు.

Related posts