రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీత్ డైరెక్టన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ సలార్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. అంతేకాకుండా ప్రభాస్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను ఓకే చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా… రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రభాస్ తన లుక్స్‌లో మార్పు తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ హీరో ఓ ఖరీదైన కారును కొన్నట్లు టాక్ వస్తోంది. లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును ప్రభాస్ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కారు ఇవాళ హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ కారు ఖరీదు సుమార్ ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
previous post