telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలకృష్ణ సినిమాలో నారా రోహిత్…

Nara-rohit

ప్రస్తుతం చాలా సినిమాలో ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. అందులోని ఎక్కువ మంది ఒక్కే కుటుంబానికి చెందినవారు. అయితే నందమూరి బాలకృష్ణ సినిమా అంటే క్రేజ్ భీభత్సంగా ఉంటుంది. అందులోనూ బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఇటీవల బాలకష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో హీరో చేస్తున్నారన్న వార్తలు సినీ సర్కిల్స్ తెగ వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ సినిమాలో బాలయ్యతో చేస్తున్నది ఎవరో కాదండీ నారారోహిత్. ఈ సినిమాలో రోహిత్ ఓ ఎమ్మెల్యే పాత్రలో కనిపించనున్నారని, అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేయనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం నారారోహిత్ ఎటువంటి సినిమా చేయడంలేదు. అయితే తన సినిమాలో అవకాశం ఇచ్చి రోహిత్‌కు బ్రెక్ ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నరని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇది నిజామా.. కాదా… అనేది.

Related posts