శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన్ను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కోర్టుకు తీసుకెళ్లారు. అయితే. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో.. ఆయనను అంపోలు జైలుకు తరలించారు. కాగా.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అచ్చెన్న బెదిరించాడని ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. అయితే, అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో గత రెండు మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సర్పంచ్ పదవికి అచ్చెన్నాయుడు భార్య నామినేషన్ వేయగా.. ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ భావించడంతో.. అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో.. బెదిరింపుల కేసు నమోదు అయ్యిందని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు తనను అరెస్ట్ చేసిన తీరుపై మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండించారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి అవుతానని, చంద్రబాబును ఒప్పించి హోంమంత్రి పదవిని తీసుకుంటానని అన్నారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని అన్నారు.
previous post