telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మగవాడు చేసేపని మహిళ చేస్తే తప్పా : శ్రుతీ హాసన్

Shruthi-Hassan

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శ్రుతీ హాసన్ అనతి కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని అగ్ర హీరోలందరి సరసన నటించింది. అనారోగ్యం కారణంగా కొంతకాలం వెండితెరకు దూరమైన శ్రుతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రుతి మరోసారి తన తాగుడు అలవాటు గురించి మాట్లాడింది. `నా స్నేహితులతో కలిసి ఒకరోజు రాత్రంతా పార్టీ చేసుకున్నాను. ప్రతి శనివారం తీసుకునే మోతాదు కంటే చాలా ఎక్కువ తీసుకున్నాను. నా జీవితానికి ఇక అది చాలనిపించింది. ఇక జన్మలో మద్యం ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నాను. మద్యం మానేసిన తర్వాత మాత్రం నా జీవితం మెరుగ్గా ఉంది అని ఫీల్ అవుతున్నాను` అని శ్రుతి చెప్పింది. ఒక మగవాడు మద్యం తీసుకుంటే ఎవరూ పట్టించుకోరని, అదే ఓ మహిళ తాగితే మాత్రం దాన్ని పెద్ద వివాదం చేసేస్తున్నారని శ్రుతి ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts