టిక్‌టాక్‌లో అతడికి ఓ స్టార్ హీరోకి ఉన్నంత మంది ఫాలోవర్లు ఉన్నారు. 11 లక్షల మంది అతడిని ఫాలో అవుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అ యువకుడు అందరూ చిరాకు పడేలా వీడియో తీసి, టిక్‌టాక్‌లో పెట్టాడు. ఈ వీడియో ఏముందంటే… ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి అటూఇటూ తూలుతూ వెళ్తుంటాడు. ఓ అమ్మాయి ఎదురుగా వస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమెకు డ్యాష్ ఇస్తాడు. దీంతో ఆమె కోపం చూసి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అతడు తన అరచేతిపై ఉమ్మి వేసి ఆ అమ్మాయి వద్దకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి, షేక్ హ్యాండ్ ఇస్తాడు. దీంతో అది ఆమెకు అంటుతుంది. అనంతరం హీరోలా అతడు తన స్నేహితుడితో కలిసి పోజులు కొడుతూ వెళ్లిపోయాడు. దీంతో అతడి అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని టిక్‌టాక్‌ను పలువురు కోరుతున్నారు. దీనిపై యాంకర్ అనసూయ కూడా స్పందించి షాదాబ్ ఖాన్ అనే ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరిని నిందించాలో నాకు తెలియడం లేదు ఇతడినా, ఇటువంటి వ్యక్తులను ఫాలో అవుతున్న వారినా ఇటువంటి వారికి జైల్లో వేయాలి.. ఇతడి ఖాతాను తొలగించాలని నేను టిక్‌టాక్ ఇండియాను కోరుతున్నాను’ అని అనసూయ మండిపడింది.
I don’t know who to blame.. him or those who follow such an asshole.. yaha hum ghar pe baithre sab chod chadke ke duniya ko is virus se bachaye.. par in jaise virus ka kya karna..This wretch needs to be put behind the bars immediately!!And take down his account first @TikTok_IN https://t.co/l8KLXmGEIj
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 17, 2020