telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

దేశపరిస్థితులను రాజకీయంగా తమకు అనుకూలం చేసుకుంటున్న బీజేపీ .. అసహనంలో సైనికుల కుటుంబాలు.. !

దేశంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను బీజేపీ పార్టీ తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దేశాభిమానాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు పనిలోపనిగా పావులు కదిపేస్తున్నారు. ఈ విషయంలో స్వయంగా ప్రధాని కూడా తక్కువేమి కాదు. ఆయన తాజాగా ‘మేరా బూత్ సబ్‌సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోని 15 వేల ప్రాంతాల నుంచి కోటిమందికిపైగా కార్యకర్తలు ఈ మెగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీని విభజించిన కాంగ్రెస్‌పైనా, ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన తెలుగుదేశం పార్టీపైనా రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని మోదీ జోస్యం చెప్పారు. తమిళనాడు చరిత్రలోనే తమ కూటమికి అతిపెద్ద విజయం దక్కబోతోందన్న మోదీ.. కేరళ ప్రభుత్వంపైనా ప్రజలు విసిగిపోయారన్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు ఆరితేరిపోయాయని, అదే వాటి అజెండా అని మోదీ విమర్శించారు.

ఇవన్నీ చూసి సైనికుల కుటుంబాలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సైనికులు ఎంతో దేశభక్తితో చేసిన సాహసాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని; మీ రాజకీయాలు చేసుకోడానికి ఇది సమయం కాదని వారు స్పష్టంగా చెపుతున్నారు. కానీ బీజేపీ మాత్రం అగ్రనేతలతో సహా, తమ ఓటు బ్యాంకు కోసమే ప్రస్తుత దేశపరిస్థితులను వాడుకోవడం వందకు వంద శాతం నిజంగా జరుగున్నదని, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఒక సూచీగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Related posts