telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇరాక్ : … తీవ్రతరమైన అల్లర్లు.. 60కి చేరిన మృతులు.. రెండున్నరవేలకుపైగా గాయాలపాలు..

protest in iraq costs 60 lives and more

దేశంలో కొనసాగుతున్న అల్లర్లతో మృతుల సంఖ్య 60 కి చేరింది. ప్రజలు సర్కారుకు వ్యతిరేకంగా రాళ్లు రువ్విన ఘటనలు, సైనికుల కాల్పుల్లో 2,500 మంది గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఇరాక్‌ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఇరాక్‌లో షియాల ప్రాబల్య ప్రాంతమైన అల్ దివానియాహ్ నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి.

ఇరాక్ దేశంలోని నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్ధాద్ నగరాల్లో అల్లర్లు పెచ్చరిల్లాయి. దేశంలో ప్రజాందోళనల నేపథ్యంలో ఆదిల్ అబ్దెల్ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆ దేశానికి చెందిన నాయకుడు మొఖ్తదా అల్ సదర్ డిమాండు చేశారు. ప్రభుత్వం స్పందించే వరకూ లెజిస్లేచర్లు, పార్లమెంటు సభ్యులు సమావేశాలు బహిష్కరించాలని ఆయన కోరారు. రాజధాని బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది.

Related posts