telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇంక అంతా సైన్యం చేతిలోనే..పూర్తి స్వేచ్ఛ నిచ్చిన .. భారత ప్రధాని, .. ఒత్తిళ్లకు లొంగొద్దు..

Modi wishes to Imran Pakistan

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రమూకలను భారత వైమానిక దళం హతమార్చిన సంగతి తెలిసిందే. దీనితో పంతంతో పాక్ నిన్నటి రోజున ఇష్టానికి ప్రవర్తించడంతో సరిహద్దులలో యుద్దవాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలకు తగిన జవాబు చెప్పాలి అని ఎన్ఎస్ఏ, రా, త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆర్మీకి చెప్పేశారు.

ఆ వెంటనే మోదీ అదేశాలు అందరికీ అందగా, వందల మంది జవాన్లు సెలవులు రద్దు చేసుకుంటూ దరఖాస్తులు చేసుకోగా, యుద్ధ విమానాలు పశ్చిమ ప్రాంతానికి తరలుతున్నాయి. సరిహద్దుల వెంట కాల్పులు కొనసాగుతున్న వేళ, తాము రెండు భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు పైలట్లను బందీలుగా పట్టుకున్నామని, ఆపై ఒక్క పైలట్ మాత్రమే దొరికాడని ప్రకటించిన పాక్, ఏ క్షణాన్నయినా దాడికి సిద్ధంగా ఉన్న వేళ, మోదీ ఇచ్చిన ఆదేశాలతో సైన్యం సమరోత్సాహంతో ఉంది.

కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా, ఉన్నతాధికారులతో సమావేశమైన మోడీ, సరిహద్దుల్లో పరిస్థితిని ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్‌ ధోవల్‌ ను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండుగంటల పాటు ఈ సమావేశం సాగగా, దూకుడు కొనసాగించాలని, పాకిస్థాన్ ఒత్తిళ్లకు లొంగవద్దని మోదీ చెప్పినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా, వాటిని తిప్పి కొట్టాలని ఆదేశించారు.

అజిత్ దోవల్ నుంచి ఆదేశాలు వెలువడటంతో, బెంగళూరు ఎయిర్ షోలో ఉన్న తేజస్‌, మిగ్‌, మిరాజ్‌ 2000, హాక్‌ లు సహా అన్ని విమానాలు, ఫైటర్ చాపర్లను సరిహద్దులకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వీటికి ఇంధనాన్ని అందించేందుకు 500 ట్రక్కులను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఇంధన డిపోల్లో చమురును నింపగా, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్‌, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. యుద్ధ సన్నద్ధతను పరిశీలించిన వైమానిక దళం తూర్పు కమాండ్‌ అధిపతి మనోజ్‌ నారావనే పనాగఢ్‌, ఆదేశిస్తే, పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

Related posts