telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కల్యాణ్ తో ఐటమ్ సాంగ్ కి రెడీ అవుతున్న హీరోయిన్

pavan

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ను ఎంపిక చేశారని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో రంగస్థలం హీరోయిన్ కూడా కనిపిస్తుందని ఇప్పుడు టాలీవుడ్ టాక్. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. పవన్ – క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో ఆమె మరింత పాపులర్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

Related posts